నోటిదూల డాక్టర్ సస్పెన్షన్.. మండిపడ్డ మాజీ హోం మంత్రి...
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రీజినల్ ఆస్పత్రి డాక్టర్ కె. సుధాకర్‌ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రీజినల్ ఆస్పత్రి డాక్టర్ కె. సుధాకర్‌ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో మాస్కులు, గ్లౌజ్‌లు లేవని చెప్పారని, అయితే వీటిని సమకూర్చడం తమ బాధ్యత అనే సంగతి మరిచిపోయి సస్పెండ్ చేస్తారా అని మండిపడ్డారు.