Asianet News TeluguAsianet News Telugu

తుళ్లూరులో జాతీయ మహిళా కమీషన్ విచారణ

రాజధాని తరలింపును నిరసిస్తూ తుళ్లూరులో జరిగిన నిరసన దీక్షలో పాల్గొన్న మహిళ పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనపై విచారణ నిర్వహించేందుకు జాతీయ మహిళా కమీషన్ ఆదివారం ఆ ప్రాంతానికి చేరుకుంది.

రాజధాని తరలింపును నిరసిస్తూ తుళ్లూరులో జరిగిన నిరసన దీక్షలో పాల్గొన్న మహిళ పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనపై విచారణ నిర్వహించేందుకు జాతీయ మహిళా కమీషన్ ఆదివారం ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా కమీషన్ సభ్యులు తుళ్లూరు ఎమ్మార్వో, డీఎస్పీతో మాట్లాడారు. పోలీసులు తమపై చేసిన దాడికి సంబంధించిన ఆధారాలను మహిళలు కమీషన్ సభ్యులకు అందించారు. శాంతియుతంగా తాము నిరసన తెలియజేస్తుంటే పోలీసులు జులుం ప్రదర్శించారని వారు ఆరోపించారు. ఇక్కడ విచారణ అనంతరం కమీషన్ సభ్యులు మందడం గ్రామానికి బయలుదేరి వెళ్లారు.