మహిళా దినోత్సవం రోజే దారుణం... నెల్లూరు జిల్లాలో మహిళను వివస్త్రను చేసిన పోలీసులు..: లోకేష్ సీరియస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడూ మహిళల పట్ల వైసీపీ అరాచకం కొనసాగడం రాష్ట్రంలో దుస్థితికి అద్దం పడుతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడూ మహిళల పట్ల వైసీపీ అరాచకం కొనసాగడం రాష్ట్రంలో దుస్థితికి అద్దం పడుతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మహిళలకి భద్రత కల్పించాల్సిన పోలీసులే వైసీపీ నేతల కోసం దుశ్శాసనపర్వం సాగించడం తీవ్ర విచారకరమన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దఅన్నలూరు గ్రామంలో వైసీపీ నేత వేస్తున్న అక్రమ లేఅవుట్ ని అడ్డుకున్న గ్రామస్తులపై దాడిచేసిన పోలీసులు మహిళ చీరలాగేసిన దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ తగాదాలో పోలీసులు జోక్యం చేసుకోవడమే తప్పు... అలాంటిది వైసీపీ నేత అక్రమ లేఅవుట్ కోసం మహిళని వివస్త్రని చేయడం సభ్యసమాజం తలదించుకునేలా చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. గ్రామకంఠం భూములు అక్రమించిన వైసిపి నేతపై కేసు నమోదు చేయాలని లోకేష్ డిమాండ్ చేసారు