Asianet News TeluguAsianet News Telugu

డప్పుచప్పుళ్లు, గజమాలలతో... గుంటూరు జిల్లాకు లోకేష్ గ్రాండ్ ఎంట్రీ

వినుకొండ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది.

First Published Aug 1, 2023, 5:45 PM IST | Last Updated Aug 1, 2023, 5:45 PM IST

వినుకొండ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. ప్రకాశం జిల్లాలో పాదయాత్రను ముగించుకుని గుంటూరులో ప్రవేశించిన లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. వినుకొండ నియోజకవర్గం  ముప్పరాజుపాలెం వద్ద పల్నాడు జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు నేతృత్వంలో టిడిపి శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పసుపు జెండాలు చేతబట్టి డప్పు చప్పుళ్ల మధ్య భారీ గజమాలలు వేసి లోకేష్ ను ఆహ్వానించారు.  మహిళలు  మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.లోకేష్ రాక సందర్భంగా స్వాగతద్వారాలు, బాణాసంచా మోతలతో వినుకొండ కార్యకర్తలు హోరెత్తించారు. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నాయకులంతా లోకేష్ కు స్వాగతం పలికారు. తెనాలి శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్,  ప్రత్తిపాటి పుల్లారావు, కన్నాలక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్, కోవెలమూడి రవీంద్ర, నజీర్ అహమ్మద్, వేగేశన నరేంద్ర వర్మ తదితరులు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు.