డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్
విశాఖపట్నంకు చెందిన వివాదాస్పద అనస్తీషియన్ డాక్టర్ సుధాకర్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
విశాఖపట్నంకు చెందిన వివాదాస్పద అనస్తీషియన్ డాక్టర్ సుధాకర్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. విశాఖపట్నం సీతమ్మధారలోని ఇంటికి వెళ్ళిన లోకేష్ డాక్టర్ సుధాకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఇంటిపెద్దను కోల్పోయి తీవ్ర దు:ఖంలో వున్న కుటుంబసభ్యులను పరామర్శించారు.