ఇచ్చినమాట నిలబెట్టుకున్న లోకేష్... హత్యాచార బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
మంగళగిరి: ఇటీవల గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో మృగాళ్ళ చేతిలో హత్యాచారానికి గురయిన తిరుపతమ్మ కుటుంబానికి మాజీ మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయం అందించారు.
మంగళగిరి: ఇటీవల గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో మృగాళ్ళ చేతిలో హత్యాచారానికి గురయిన తిరుపతమ్మ కుటుంబానికి మాజీ మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయం అందించారు. తిరుపతమ్మ హత్యాచారం గురించి తెలిసిన వెంటనే ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు లోకేష్. ఈ సమయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ హమీని నెరవేరుస్తూ ఇవాళ (సోమవారం) తిరుపతమ్మ కుటుంబసభ్యులను కలిసిన లోకేష్ రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారు. తిరుపతమ్మ భర్త శ్రీనివాసరావు, కుమార్తె అఖిల, కుమారుడు వరుణ్ సాయికి సహాయాన్ని అందించారు లోకేష్. తిరుపతమ్మ కుమార్తె పేరున రూ.3 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్, కుమారుడు వరుణ్ సాయి పేరు మీద రూ.2 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేసారు నారా లోకేష్.