ఏలూరులో వింత రోగం...బాధితులను పరామర్శించిన సీఎం జగన్
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలు హటాత్తుగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలు హటాత్తుగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు కేవలం ఏలూరులోనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆందోళనకు కారణమయ్యింది. ఇలా వందల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైఎస్ జగన్ స్వయంగా పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, వైద్యారోగ్య శాఖ అధికారులు వున్నారు.