వైసిపి అండతో నాకు అన్యాయం... ప్రశ్నిస్తే వెలేసిన కుల సంఘం : తాడేపల్లి మహిళ ఆవేదన

తాడేపల్లి : తన ఇంటికి వెళ్లేందుకు దారిలేకుండా అడ్డంగా చర్చికి సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నారని... దీన్ని అడ్డుకుంటున్నానని కుల సంఘం నుండి వెలివేసారని తాడేపల్లికి చెందిన ఇసుకపల్లి రజిత ఆవేదన వ్యక్తం చేసింది. 

First Published Dec 20, 2022, 4:58 PM IST | Last Updated Dec 20, 2022, 4:58 PM IST

తాడేపల్లి : తన ఇంటికి వెళ్లేందుకు దారిలేకుండా అడ్డంగా చర్చికి సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నారని... దీన్ని అడ్డుకుంటున్నానని కుల సంఘం నుండి వెలివేసారని తాడేపల్లికి చెందిన ఇసుకపల్లి రజిత ఆవేదన వ్యక్తం చేసింది. క్రిష్టియన్ పేటలోని తన ఇంటి స్ధలంలో అక్రమంగా కళావేదిక నిర్మిస్తున్నారంటూ ఆమె అడ్డుకున్నారు. గతంలో ఇలాగే తన స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించగా అధికారులకు ఫిర్యాదు చేసానని... తన వద్దగల పత్రాలు పరిశీలించి కళావేదిక నిర్మాణానికి అనుమతి నిరాకరించారని అన్నారు. అయితే తాజాగా అధికార వైసిపి నేతల అండతో మళ్లీ కళావేదిక నిర్మాణం చేపడుతున్నారని... వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలంటూ రజిత కోరారు. ఈ క్రమంలోనే తన స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆమె తాడేపల్లి పోలీసులకు పిర్యాదు చేసారు.