వినుకొండ బిజెపి అధ్యక్షుడిపై హత్యాయత్నం... మున్సిపల్ కమీషనర్ పనేనా?
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ బిజెపి అధ్యక్షుడు మేడం రమేష్ పై శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్ళిన సమయంలో కొందరు కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ బిజెపి అధ్యక్షుడు మేడం రమేష్ పై శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్ళిన సమయంలో కొందరు కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడికి వినుకొండలోని సురేష్ మహల్ రోడ్డు విస్తరణ పనుల వివాదమే కారణమని తెలుస్తోంది. రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిఫల్ అధికారులు శివాలయాన్ని తొలగించగా... హిందూ దేవాలయాన్ని తొలగించడంపై బిజెపి, జనసేన కలిసి న్యాయపోరాటం చేస్తున్నాయి.
తనపై దాడి చేయించింది వినుకొండ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ అని రమేష్ అనుమానిస్తున్నాడు. ఆయనపై చర్యలు తీసువాలని ఉన్నతాధికారులకు తాను ఫిర్యాదు చేశానని...దీన్ని మనసులో పెట్టుకుని తనపై దాడి చేయించి వుంటాడని రమేష్ అనుమానం వ్యక్తం చేశాడు.