Asianet News TeluguAsianet News Telugu

ఎల్లుండి పెళ్లనగా... సాఫ్ట్ వేర్ పెళ్లికొడుకును అతి కిరాతకంగా నరికి...

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

First Published Jan 6, 2021, 10:43 AM IST | Last Updated Jan 6, 2021, 10:43 AM IST

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డలో తెల్లవారు జామున వాకింగ్ కి వెళ్లిన తండ్రి కొడుకుపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు.  ఈ దాడిలో తండ్రి స్వల్ప గాయాలతో బయటపడగా కొడుకు హర్షవర్ధన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని స్థానిక హాస్పిటల్ కు తరలించిన చికిత్స అందిస్తున్నారు.

హర్షవర్ధన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా ఎల్లుండి అతడి పెళ్లి. ఈ సమయంలోనే దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ దాడికి ప్రేమ వ్యవహరం ఏమయినా కారణమా లేదా పాతకక్షలు కారణమా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.