Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు టిడిపి ఇంచార్జిపై హత్యాయత్నం... కారుతో గుద్దిన యువకుడు

నెల్లూరు : తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కారుతో గుద్ది హత్యాయత్నానికి పాల్పడ్డాడు

First Published Nov 27, 2022, 10:12 AM IST | Last Updated Nov 27, 2022, 10:12 AM IST

నెల్లూరు : తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కారుతో గుద్ది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఇంటిఎదుటే కొడుకుతో మద్యంమత్తులో వుండి క గొడవపడుతున్న రాజశేఖర్ రెడ్డిని శ్రీనివాసులు మందలించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన యువకుడు కారును వేగంగా శ్రీనివాసులు రెడ్డిపైకి పోనిచ్చి ఢీకొట్టాడు. దీంతో శ్రీనివాసులు రెడ్డి కాలువిరిగి హాస్పిటల్ పాలయ్యాడు. 

ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులకు తోడు నెల్లూరును క్రైమ్ క్యాపిటల్ గా చేయాలనుకుంటున్నాడా అనే అనుమానం కలుగుతోందంటూ మండిపడ్డారు. పెద్ద సైకో పాలనలో ఊరికో సైకో స్వైరవిహారం చేస్తున్నారన్నారు. ఇలా టిడిపి నాయకుడు శ్రీనివాసులు రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన  వైసీపీ సానుభూతిపరుడు సైకో రాజశేఖరరెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేసారు.