Asianet News TeluguAsianet News Telugu

తుని రైలు దగ్దం కేసు... రైల్వే కోర్టుకు ముద్రగడ పద్మనాభం


విజయవాడ: కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ చేస్తూ 2016 జనవరి 31న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.


విజయవాడ: కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ చేస్తూ 2016 జనవరి 31న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని తుని వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును నిరసనకారులు దగ్ధం చేశారు. ఈ కేసులో భాగంగా ఇవాళ విజయవాడ రైల్వే కోర్టుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తో పాటు పలువురు కాపు నాయుకులు హాజరయ్యారు. 

అప్పట్లో రైల్వే చట్టం సెక్షన్ 146,147,153,174 కింద ముద్రగడతో సహా పలువురి పై రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 41మందికి గానూ ఈరోజు 35 మంది హాజరయ్యారు. వాదనల అనంతరం ఈనెల 16 కు విచారణ వాయిదా వేశారు న్యాయమూర్తి.