MS Dhoni Birthday : ఈ కటౌట్ చాలు కంటెంట్ చెప్పేస్తుంది... తెలుగురాష్ట్రాల్లో ధోనీ క్రేజ్ చూడండి...

మహేంద్ర సింగ్ ధోని... ఇది పేరు కాదు కొందరు క్రికెట్ ప్రియుల గుండెచప్పుడు. మిస్టర్ కూల్ కెప్టెన్సీతోనే కాదు ధనా ధన్ బ్యాటింగ్, హెలికాప్టర్ షాట్లతో క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకున్నాడు ధోని.

First Published Jul 7, 2022, 10:16 AM IST | Last Updated Jul 7, 2022, 10:16 AM IST

మహేంద్ర సింగ్ ధోని... ఇది పేరు కాదు కొందరు క్రికెట్ ప్రియుల గుండెచప్పుడు. మిస్టర్ కూల్ కెప్టెన్సీతోనే కాదు ధనా ధన్ బ్యాటింగ్, హెలికాప్టర్ షాట్లతో క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకున్నాడు ధోని. ఇలా సక్సెస్ ఫుల్ మ్యాచ్ ఫినిషర్ గా టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు ధోని. ఇలా భారత క్రికెట్  చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ధోని ఇవాళ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.  తమ అభిమాన ఆటగాడి భర్త్ డే అంటూ అభిమానులు ఆగుతారా... భారీ ఏర్పాట్లకు సిద్దమయ్యారు. ఇలా ఏపీలో కూడా ధోని అభిమానులు భారీగా ఏర్పాట్లు చేసారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని అంబారుపేట గ్రామంలో అభిమానులు 41అడుగుల భారీ కటౌట్ ఏర్పాటుచేసారు. అలాగే  41కేజీల కేక్ కట్ చేసి ధోని భర్త్ డే సంబరాలు జరిపేందుకు సిద్దమయ్యారు. జాతీయ రహదారి పక్కనే ధోని భారీ కటౌట్ వాహనదారులను ఆకట్టుకుంటోంది. అంబారుపేటకు చెందిన యువకులు భువన్ చారీ, భరత్, సాయి, సిద్దు, బెనాకర్ సహా మరికొందరు ఇలా ధోనీపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.