వైసిపి ఎంపీ అనుచరుడు భూకబ్జా... టవరెక్కి బాధితుడి ఆందోళన
అమరావతి: తన స్థలాన్ని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు కబ్జా చేశారని...
అమరావతి: తన స్థలాన్ని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు కబ్జా చేశారని... ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ హోర్డింగ్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు సదరు బాధితుడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో బిక్షాలు అనే వ్యక్తికి 8సెంట్ల స్థలం వుంది. అవసరాల నిమిత్తం అతడు ఇందులోంచి 4సెంట్ల స్థలాన్ని ఎంపీ నందిగాం సురేష్ అనుచరులకు అమ్మాడు. అయితే తమ 4 సెంట్లు స్థలమే కాకుండా మిగతా నాలుగు సెంట్లు కూడా తమదేనని సదరు ఎంపీ అనుచరులు దౌర్జన్యానికి దిగుతున్నాడని ...ప్రహరీ నిర్మాణం కూడా చేపట్టారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. తన స్థలాన్ని తనకు దక్కేలా చూసి న్యాయం చేయాలంటూ బిక్షాలు టవరెక్కి నిరసనకు దిగాడు.