కమీషన్ల కు కక్కుర్తి పడి అభివృద్ధి రివర్స్... జగన్ పై కేశినేని నాని ఫైర్..
విజయవాడ 3వ డివిజన్ గణేష్ నగర్ లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లు పర్యటించారు.
విజయవాడ 3వ డివిజన్ గణేష్ నగర్ లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లు పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు. అధికారంలోకి వస్తే చించేస్తాం.. పొడిచేస్తాం అన్నారు అంటూ ఎద్దేవా చేశారు. స్టార్మ్ వాటర్ డ్రైనేజీ కోసం 2015లో అప్పటి కేంద్ర మంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో మాట్లాడి 3 రోజులలో 450 కోట్లు నిధులు మంజూరు చేయించామన్నారు. ఆ నిధులు కూడా విడుదల చేయడం లేదు. యుద్ధ ప్రాతిపదికన విజయవాడలో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కు కక్కుర్తి పడిఅభివృద్ధిని రివర్స్ చేస్తే సహించేది లేదని అన్నారు.