కొడుకు కోసం తల్లి పోరాటం.. వర్షంలో తడుస్తూ ఆందోళన

తన కుమారుడు తనకు కావాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల వివేకానంద విగ్రహం వద్ద ఓ మహిళ న్యాయపోరాటం చేసింది. 

First Published Jul 15, 2024, 10:20 PM IST | Last Updated Jul 15, 2024, 10:20 PM IST

తన కుమారుడు తనకు కావాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల వివేకానంద విగ్రహం వద్ద ఓ మహిళ న్యాయపోరాటం చేసింది. వజ్రపుకొత్తూరు మండలం సుంకర జగన్నాధపురం గ్రామానికి చెందిన నెయ్యిల అరుణ అనే వివాహితను తన భర్త తనను విడిచి పెట్టాడని,కోర్టులో కేసు నడుస్తుండగా తన వద్దే ఉంటున్న 4 ఏళ్ల తన కుమారుణ్ణి పలాస లో బజారు చేస్తుండగా తీసుకెళ్లిపోయాడని బాధితురాలు చెపుతోంది.పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా ఫలితం లేనందునే తాను ఇలా వర్షాన్ని సహితం లెక్కచేయక తడుస్తూ వివేకానంద విగ్రహం వద్ద న్యాయపోరాటానికి దిగానని, తన బిడ్డ తనకు దక్కేవరకు ఇక్కడ్నించి కదిలేదే లేదని చెపుతోంది.