వానరం ఉసురుతీసిన మితిమీరిన వేగం.. ఆ యువకుల చేసిన పనికి హ్యాట్సాఫ్..
కర్నూలులోని నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి పై తన మందతో రోడ్డు దాటుతున్న ఓ వానరాన్ని వేగంగా వస్తున్న ఓ మోటార్ సైకిల్ ఢీ కొట్టింది.
కర్నూలులోని నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి పై తన మందతో రోడ్డు దాటుతున్న ఓ వానరాన్ని వేగంగా వస్తున్న ఓ మోటార్ సైకిల్ ఢీ కొట్టింది. బలమైన తాకిడికి తలకు తీవ్రగాయమై నడిరోడ్డుపై చివరి శ్వాస కోసం కొట్టుమిట్టాడింది. ఇది గమనించిన కొందరు యువకులు కోతిని పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేయించినా లాభం లేక కోతి చనిపోయింది. దీంతో దాని మృతదేహానికి ఆ యువకులు అంత్యక్రియలు నిర్వహించారు.