భార్యపై స్నేహితుడి అత్యాచారం... మనస్థాపంతో దంపతుల ఆత్మహత్యాయత్నం (సెల్పీ వీడియో)

నెల్లూరు: తన భార్యకు మత్తుమందిచ్చి స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సెల్పీ వీడియో  తీసుకుంటూ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన దారుణం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

First Published Jun 24, 2022, 2:23 PM IST | Last Updated Jun 24, 2022, 2:23 PM IST

నెల్లూరు: తన భార్యకు మత్తుమందిచ్చి స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సెల్పీ వీడియో  తీసుకుంటూ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన దారుణం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. లింగసముద్రం  మండలం చిన్నపవని గ్రామంలో పురుగుల మందు తాగిన ప్రాణాపాయ స్థితిలో వున్న దంపతులను గుర్తించిన గ్రామస్తులు కావలి హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగానే వున్నట్లు... మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. అయితే దంపతులు ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇంతియాజ్ అనే స్పేహితుడు తన భార్యకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని... ఈ వీడియోలతో కొంతకాలంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపారు. తమ చావుకు కారణం ఇలియాజ్ అంటూ భార్యాభర్తలిద్దరూ కన్నీరు పెట్టుకుంటూనే సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగారు. బాధిత దంపతులు నెల్లూరు రంగనాయికుల పేటకు చెందిన వారిగా గుర్తించారు.