మంగళగిరిలో వేక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మంగళగిరి పట్టణ పరిధిలో CK హై స్కూల్ నందు వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు .
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుండి మంగళగిరి పట్టణ పరిధిలో CK హై స్కూల్ నందు వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు .కలెక్టర్ గారు, DMHO గార్లు కలిసి ఈ రోజు మంగళగిరి PHC కి 100 కోవాక్సిన్ డోసులు కేటాయించడం జరిగిందని, 60 సంవత్సరాల పై బడిన వారికి 2వ డోసు క్రింద మాత్రమే ఏయనున్నారని అన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య మరియు మున్సిపల్, పోలీసు అధికారులు దగ్గరుండి పర్యక్షిస్తున్నారని అన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించి వాక్సిన్ వేయించుకోవాలని అన్నారు.