Asianet News TeluguAsianet News Telugu

సీఎం సారూ మమ్మల్ని పట్టించుకోండి...ఓ మిరపరైతు ఆవేదన...

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఓ యువ రైతు...

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఓ యువ రైతు...తాను పండించిన మిరప పంట పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియోను వాట్సాప్ గ్రూపు లో వైరల్ చేశాడు. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో వేసిన మిరప పంటను కోయటానికి కూలీలెవ్వరూ రావడం లేదరని, వచ్చినవారిని వాలంటీర్లు,పోలీస్ లు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తొమ్మిది నెలల పాటు పడిన కష్టం వృధాగా పోయిందని, పంటకోసం ఎకరాకు రెండు లక్షల అప్పయిందని.. ఎలా తీర్చాలని జగన్ ను ప్రశ్నిస్తున్నాడు. ఈ వీడియోను ముఖ్యమంత్రి వరకు చేరేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాడు...