వైసిపి ప్లెక్సీని చించారని... చిన్నారులను స్టేషన్ కు తరలించిన పిడుగురాళ్ల పోలీసులు

గుంటూరు: చిన్నారులు కొందరు సరదాగా ఆడుకుంటుండగా పొరపాటున తగలడంతో అధికార వైసిపి ప్లెక్సీ చిరిగిపోయింది. 

First Published Apr 26, 2022, 3:22 PM IST | Last Updated Apr 26, 2022, 3:22 PM IST

గుంటూరు: చిన్నారులు కొందరు సరదాగా ఆడుకుంటుండగా పొరపాటున తగలడంతో అధికార వైసిపి ప్లెక్సీ చిరిగిపోయింది. దీంతో వైసిపి నాయకులు ఫిర్యాదు చేయగా అధికార పార్టీ మెప్పుకోసం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కావాలనే ప్లేక్సీ చించారని చిన్నారులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఓ పూట అక్కడే కూర్చోబెట్టారు. అయితే ప్రతిపక్ష టిడిపి నాయకులు వెంటనే స్పందించి వ్యక్తిగత పూచికత్తు మీద పిల్లలను విడిపించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానుపాడులో చోటుచేసుకుంది