మంగళగిరి ఎయిమ్స్ లోనూ ఆరోగ్యశ్రీ సేవలు..: వైద్యారోగ్య మంత్రి విడదల రజని
గుంటూరు : అతి త్వరలో మంగళగిరి ఎయిమ్స్ ( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించనున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖల మంత్రి విడదల రజని తెలిపారు.
గుంటూరు : అతి త్వరలో మంగళగిరి ఎయిమ్స్ ( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించనున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖల మంత్రి విడదల రజని తెలిపారు. ఇప్పటికే ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని... అన్ని పూర్తవగానే ఎయిమ్స్ లోనూ వైద్యసేవలు పేదలకు అందుబాటులో వుంటాయన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ కు చేసిందేమీలేదని... వైసిపి అధికారంలోకి వచ్చాకే ముఖ్యమంత్రి జగన్ మౌళిక సదుపాయాల కోసం రూ.55కోట్లు ఖర్చు చేసారన్నారు.
సోమవారం మంత్రి విడదల రజని మంగళగిరిలోని ఎయిమ్స్ ను పరిశీలించారు. హాస్పిటల్ లోని అన్ని విభాగాలను పరిశీలించిన మంత్రి ప్రజలకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లను అడిగి సమస్యలేమిటో తెలుసుకున్న మంత్రి రజని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.