ఇంట్లో తాగి పడుకున్న దధ్దమ్మలు.. ఇప్పుడు అభివృద్ధి గుర్తొచ్చిందా.. వెల్లంపల్లి
విజయవాడ, దుర్గగుడి ఫ్లైఓవర్ ను ఆగష్టు 30 నాటికి అందుబాటులోకి తెస్తామని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు.
విజయవాడ, దుర్గగుడి ఫ్లైఓవర్ ను ఆగష్టు 30 నాటికి అందుబాటులోకి తెస్తామని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ లో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయని మండిపడ్డారు. 2.6కి.మి ఉన్న దుర్గగుడి ఫ్లై ఓవర్ ను కృష్ణా పుష్కరాలకు ప్రారంభం చేస్తామని చంద్రబాబు బీరాలు పలికారని విరుచుకుపడ్డారు. శుక్రవారం మంత్రి వెలంపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మరియు నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి దుర్గగుడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు.