చంద్రబాబు ఇలాకాలో వైసిపి పాగా... ఇక రాజకీయ సన్యాసమే: మంత్రి వెల్లంపల్లి
విజయవాడ: చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ 89 కి 75 స్థానాలు గెలిచిందని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
విజయవాడ: చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ 89 కి 75 స్థానాలు గెలిచిందని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫలితాలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలని...ఇక ఆయన రాజకీయాల నుండి తప్పుకోవాలని సూచించారు. పవన కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు.ఇక స్థానిక ఎంపీ కేశినేని ఢిల్లీలో కూర్చుని నియోజకవర్గం కోసం ఏమి చేశారు? అని ప్రశ్నించారు.కార్పోరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ క్లిన్ స్వీప్ చేస్తుందన్నారు. టిడిపిలోనే అనేక వర్గాలు ఉన్నాయని...వారిలో వారికే పడదు... వాళ్ళు ప్రజలకు సేవ ఎలా చేస్తారు అని అన్నారు.కుప్పం, టెక్కలి, తుని, మైలవరం లాంటి టీడీపీ హేమహేమిలు ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీ ఆధిపత్యం సాధించిందన్నారు.