Asianet News TeluguAsianet News Telugu

కూతురు ప్రేమ పెళ్లి.. నడిరోడ్డుపై చితకబాదిన మంత్రి వనిత గన్ మన్

స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గన్ మెన్ చంద్రారావు కూతురు ఐదునెలల క్రితం ప్రేమవివాహం చేసుకుంది. 

స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గన్ మెన్ చంద్రారావు కూతురు ఐదునెలల క్రితం ప్రేమవివాహం చేసుకుంది. అయితే అది నచ్చని చంద్రారావు కూతురు, అల్లుడిపై దాడికి పాల్పడ్డాడు. రోడ్డు మీద కనిపించిన వారిమీద దాడికి పాల్పడిన గన్ మెన్. ఇది గమనించిన స్థానికులు గన్ మెన్ నుండి వారిని కాపాడి పోలీస్ స్టేషన్ కు వెళ్లమని పంపించారు.  మంత్రి దగ్గర పనిచేస్తే మాత్రం ప్రేమికుల మీద  రోడ్డుమీద దాడులకు పాల్పడటం దారుణమని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వద్ద పనిచేసే గన్ 
మెన్ కూతురి మీద దాడి చేయడం సిగ్గుచేటని స్థానికులు మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన చంద్రరావుతో పాటు పలువురిపై ఏలూరు టూ టౌన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

Video Top Stories