క్రీడాంధ్ర ప్రదేశ్ లక్ష్యంతో ''జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్''... ప్రారంభించిన మంత్రి రోజా
అమరావతి : రాష్ట్రంలోని క్రీడాకారులకు అండగా వుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ''జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్'' తీసుకువచ్చిందని క్రీడలు, యువజన సర్వీస్ శాఖల మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
అమరావతి : రాష్ట్రంలోని క్రీడాకారులకు అండగా వుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ''జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్'' తీసుకువచ్చిందని క్రీడలు, యువజన సర్వీస్ శాఖల మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఏపీ సచివాలయంలో శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, క్రీడా శాఖ అధికారులతో కలిసి మంత్రి రోజా జగనన్న స్పోర్ట్స్ యాప్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడకారుడికి ప్రోత్సాహం అందించి విజేతగా నిలపడమే జగనన్న లక్ష్యమని అన్నారు. అనంతరం నూతన స్పోర్ట్స్ పాలసీ సవరణలపై మంత్రి రోజా అధికారులతో సమీక్షించారు.