మట్టిలో అలవాటై మ్యాట్ పై గ్రిప్ దొరకట్లేదు...: మంత్రి ఆర్కె రోజా
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ క్రీడల అభివృద్దికి చేపట్టాల్సిన చర్యల గురించి క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖల మంత్రి ఆర్కె రోజా సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ క్రీడల అభివృద్దికి చేపట్టాల్సిన చర్యల గురించి క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖల మంత్రి ఆర్కె రోజా సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. ఏపీ సచివాలయంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తో పాటు ఉన్నతాధికారులు రజత్ భార్గవ, కన్నబాబు, వాణి మోహన్ తో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కబడ్డి, వాలిబాల్ వంటి క్రీడలను ఏపీ క్రీడాకారులు మట్టిలో ప్రాక్టిస్ చేసి ఒక్కసారిగా మ్యాట్ పై ఆడాలంటే ఇబ్బందిపడుతున్నారని... వారికి గ్రిప్ దొరకట్లేదని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులకు తొలగించి మంచి సౌకర్యాలు కల్పిస్తే క్రీడాకారులు మరింతగా రాణిస్తారని మంత్రి రోజా పేర్కొన్నారు.