డ్రైవర్లకు ప్రొటెక్షన్ కిట్స్ పంపిణీ.. మంత్రి పేర్ని నాని

లాక్ డౌన్ సమయంలో తప్పని పరిస్థితుల్లో రవాణా చేసే ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లకు ఏపీ రవాణా శాఖ ద్వారా కోవిడ్-19 డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పేర్ని మచిలీపట్నంలో ప్రారంభించారు. 
First Published Apr 15, 2020, 5:29 PM IST | Last Updated Apr 15, 2020, 5:31 PM IST

లాక్ డౌన్ సమయంలో తప్పని పరిస్థితుల్లో రవాణా చేసే ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లకు ఏపీ రవాణా శాఖ ద్వారా కోవిడ్-19 డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పేర్ని మచిలీపట్నంలో ప్రారంభించారు.  లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో నిత్యావసరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, మెడికల్ ఎక్యూప్ మెంట్ వంటి విషయంలో అంతరాష్ట్రాల రవాణాకు అనుమతులు ఇచ్చామని, క్లిష్ట పరిస్తితుల్లో సామాజిక సేవ కింద వీటి రవాణాకు ముందుకు వచ్చిన డ్రైవర్లు, క్లీనర్ల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వంపై ఉందని, సీఎం జగన్ ఆదేశాల మేరకు రవాణా శాఖ ద్వారా కోవిడ్-19 డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ ను అందిస్తున్నాంఅన్నారు. రాష్ట్రంలో అన్ని బ్రేక్ ఇన్సెక్టర్ల వద్దకు కిట్లను సమృద్దిగా చేర్చామని చెప్పారు.