చంద్రబాబునాయుడుకు కొడాలి నాని సవాల్.. దమ్ముంటే రాజీనామా చేయి..
అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపుకు వీలుగా గవర్నర్ హరిచందన్ మూడు రాజధానుల బిల్లులు ఆమోదించడం
అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపుకు వీలుగా గవర్నర్ హరిచందన్ మూడు రాజధానుల బిల్లులు ఆమోదించడంపై చంద్రబాబు చేసిన కామెంట్లపై కొడాలి నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు అంత దమ్మూ, ధైర్యం ఉంటే అమరావతి అజెండాపై తన ప్రజాప్రతినిధులతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న పిచ్చి తుగ్లక్ నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా సిగ్గు లేకుండా జూమ్ యాప్ లో పిచ్చి వాగుడు వాగుతున్నారని మంత్రి కొడాలి వ్యాఖ్యానించారు. సీమ జిల్లాల్లో 52 సీట్లుంటే బావ, బామ్మర్ది బాలయ్య మాత్రమే గెలిచారని, అక్కడ ప్రజలు చీదరించుకున్నా చంద్రబాబుకు ఇంకా బుద్ది రాలేదని కొడాలి ఆక్షేపించారు