గడపగడపకు మన ప్రభుత్వం... గరిటపట్టి టీ, కాఫీ తయారుచేసిన మంత్రి కారుమూరి
తణుకు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులంతా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు.
తణుకు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులంతా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలవద్దకు వెళుతూ ప్రజత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ది గురించి వివరిస్తున్నారు. ఇలా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకం అయ్యారు. బుధవారం తణుకు పట్టణంలోని 3వ వార్డులో పర్యటించిన మంత్రి ఓ టీ స్టాల్ నిర్వహకుడిని పలకరించారు. ప్రభుత్వం పథకాల గురించి అడిగి వాటివల్ల అతడి కుటుంబానికి జరిగిన లబ్ది గురించి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కారుమూరి స్వయంగా గరిట పట్టి టీ, కాఫీ తయారుచేసి అందరికీ అందించారు.