ఖరీఫ్ సన్నద్దత... జాయింట్ కలెక్టర్లకు వ్యవసాయ మంత్రి కీలక ఆదేశాలు

విజయవాడ: వ్యవసాయ ఉన్నతాధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లతో ఖరీఫ్ సన్నద్ధ సమావేశాన్ని నిర్వహించారు వ్యవసాయ మంత్రి కన్నబాబు. 

First Published Jun 9, 2021, 7:09 PM IST | Last Updated Jun 9, 2021, 7:09 PM IST

విజయవాడ: వ్యవసాయ ఉన్నతాధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లతో ఖరీఫ్ సన్నద్ధ సమావేశాన్ని నిర్వహించారు వ్యవసాయ మంత్రి కన్నబాబు. 2021 ఖరీఫ్ కోసం రాయితీపై విత్తనాల సరఫరా, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ రుణాలు, వైఎస్సార్ పొలంబడి, వేరుశెనగ విత్తనాల పంపిణి అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు మంత్రి. పంటల ప్రణాళికలకి ఈ ఏడాది నుంచి అంత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. క్రాప్ ప్లానింగ్ , ప్రాంతాల వారీగా ఏఏ పంటలకు సానుకూలత , ప్రతికూలత , ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లు మరింత దృష్టి సారించాలి మంత్రి సూచించారు. వరికి సంబంధిచి సూక్ష్మ స్థాయిలో ప్రణాలికలు చాల ముఖ్యమని... బోర్ల కింద పండించే వరి పంటలకి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలన్నారు. రైతు దినోత్సవ ఏర్పాట్లు, ఆర్బీకే ల మౌలిక సదుపాయాల కల్పన, సేవలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు మంత్రి కన్నబాబు.