Harish Rao Birthday:కాలినడకన ఏడుకొండలెక్కిన మంత్రి హరీష్... శ్రీవారి సన్నిధిలో పుట్టినరోజు
తిరుమల: ఇవాళ (శుక్రవారం) తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
తిరుమల: ఇవాళ (శుక్రవారం) తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న మంత్రి అలిపిరి మొదటి మెట్టు వద్ద కొబ్బరి కాయ కొట్టి కాలిబాటన ఏడుకొండలపైకి చేరుకున్నారు. కొండపైకి చేరుకున్న మంత్రి హరీష్ కు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బసచేసిన మంత్రి శుక్రవారం ఉదయం అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు.