చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. అద్దంకిలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్..
అన్నార్తుల ఆకలి తీర్చడానికి గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ సేవలను కుట్రపూరితంగా వైసీపీ నిలిపివేసిందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించామని చెప్పారు. అలాగే, ప్రజలను భయపెడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి.. పింఛన్ పెంపు లాంటి హామీలను కూడా నెరవేర్చామన్నారు. అద్దంకి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించారు. రాబోయే కాలంలో ప్రజలకు మేలు జరిగేలా మరిన్ని కార్యక్రమాలను చేపట్టే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు.
చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. అద్దంకిలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్..