మాస్ కా బాస్ మంత్రి ... పొలంగట్టుపై కూర్చుని కల్లు రుచిచూసిన ఎర్రబెల్లి
వరంగల్ : తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలతో ఇట్టే కలిసిపోతూ మాస్ లీడర్ గా ఎదిగారు.
వరంగల్ : తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలతో ఇట్టే కలిసిపోతూ మాస్ లీడర్ గా ఎదిగారు. పల్లెటూరు ప్రజలతో మమేకమవుతూ మంత్రి హోదాను పక్కనబెట్టిమరీ సాధాసీదా వ్యక్తిలా వుండేందుకు ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన రాజకీయాలు కూడా అంగూఆర్భాటం లేకుండా ప్రజలకు దగ్గరయ్యేలా వుంటాయి. ఇలా నిత్యం ప్రజల్లో ఒకరిలా వుండే మంత్రి ఎర్రబెల్లి సామాన్యులు చేసే పనులన్నీ చేస్తుంటారు. ఇలా తాజాగా జనగామ జిల్లాలోని సొంత నియోజకర్గం పాలకుర్తిలో పర్యటించిన ఆయన మరోసారి తన సింప్లిసిటీని చాటుకుని ప్రజలకు మరింత దగ్గరయ్యారు.
పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి పొలాల వద్దే కల్లు తాగారు. గౌడ సామాజికవర్గం అభ్యర్థన మేరకు అప్పుడు చెట్టుపైనుండి దించిన నీరా (కల్లు) రుచి చూసారు. మంత్రి ఎర్రబెల్లి కల్లుతాగడం చూసి అక్కడున్న నాయకులు, ప్రజలు ఆశ్చర్యపోయారు.