పదో తరగతి ఫలితాల్లో టాప్ లేపిన ప్రకాశం, అనంతపురంది ఆఖరి స్థానమే... ఓవరాల్ గా ఇదీ పరిస్థితి
అమరావతి: ఇటీవల వాయిదాపడ్డ ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు ఎట్టకేలకు ఇవాళ(సోమవారం) విడుదలయ్యాయి.
అమరావతి: ఇటీవల వాయిదాపడ్డ ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు ఎట్టకేలకు ఇవాళ(సోమవారం) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేసారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్ష రాసినవారిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంటే 67.26శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. జిల్లాల వారిగా చూసుకుంటే అత్యధిక ఉత్తీర్ణత శాతంతో (78.3) ప్రకాశం ప్రథమ స్థానంలో నిలవగా, అత్యల్ప ఉత్తీర్ణత శాతంతో (49.7) అనంతపురం ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు వచ్చేనెల (జూలై 6 నుంచి) సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.