నిరూపిస్తే తప్పుకొంటా: బాబుపై అవంతి ఫైర్

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఏపీ మంత్రి  అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు.

First Published Feb 29, 2020, 7:48 AM IST | Last Updated Feb 29, 2020, 7:48 AM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఏపీ మంత్రి  అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖలో చంద్రబాబునాయుడు కాన్వాయ్‌పై పులివెందుల నుండి మనుషులను రప్పించి  దాడి  చేయించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటానని ఆయన సవాల్ విసిరారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో  మాట్లాడారు.  ఎక్కడి నుండో మనుషులను రప్పించాల్సిన అవసరం తమకు లేదన్నారు. పులివెందుల నుండి  మనుషులను రప్పించినట్టుగా నిరూపించాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు.  ఈ విషయమై నిరూపిస్తే  తాను రాజీనామా చేస్తానని బాబుకు స్పష్టం చేశారు.