Asianet News TeluguAsianet News Telugu

ఆయనేమైనా జ్యోతిబా పూలేనా.. చంద్రబాబుకు మంత్రి అనిల్ స్ట్రాంగ్ రిటార్ట్..

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. 

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. కార్మికుల మందుల కొనుగోల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని విచారణలో వెల్లడైంది. అవినీతిపరుడ్ని అరెస్ట్ చేస్తే.. టీడీపీ గగ్గోలు పెడుతుందని, అవినీతి చేశాడని అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేస్తే.. దానికి కూడా చంద్రబాబు బిసి కార్డు వాడుతున్నాడని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ తో చినబాబు, పెదబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నాడు. ఎవరు తప్పు చేసినా.. ప్రభుత్వం ముందు అందరూ సమానులూనని,స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర లేకపోతే బయటికి వస్తాడని అన్నారు.