Asianet News TeluguAsianet News Telugu

నా స్పీడుకు నువ్వు తట్టుకోలేవు.. నిరూపిస్తే మీసం తీసుకుని తిరుగుతా.. ఉమకు అనిల్ ఛాలెంజ్

ప్రాజెక్టులు మేమే కట్టామంటూ ఢంకా వేస్తున్న టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. 

ప్రాజెక్టులు మేమే కట్టామంటూ ఢంకా వేస్తున్న టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. వెలుగొండ టిడిపి హయంలో పూర్తి అయ్యింది అనిచెప్పుకోవడం సిగ్గు చేటు.. రాయలసీమకు నష్టం చేసింది టిడిపి కదా..నిజంగా రాయలసీమకు న్యాయం చేసి ఉంటే 10 సీట్లు ఇచ్చేవారు ప్రజలు..గలేరు, నగరి పూర్తి చేయకుండానే మేము చేసాము అంటున్నారు సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు. పోలవరం70 శాతం చేసాము అని చెప్పుకునే ఉమా.. నిరూపిస్తే మీసం తీసుకొని తిరుగుతా.. నిరూపించలేకపోతే నువ్వు మీసం తీసి తిరుగుతావా అంటూ ఛాలెంజ్ విసిరారు.