Asianet News TeluguAsianet News Telugu

గొడుగులతో క్యూలైన్లో మందుబాబులు.. స్థానికులకు మాత్రమే అమ్మకాలు...

గుంటూరు జిల్లా తుళ్ళూరులో చేతిలో గొడుగులతో, ముఖానికి మాస్కులతో, ఆధార్ కార్డులు పట్టుకుని మద్యం బాబులు కిలో మీటర్ల కొద్దీ బారులు తీరారు.

గుంటూరు జిల్లా తుళ్ళూరులో చేతిలో గొడుగులతో, ముఖానికి మాస్కులతో, ఆధార్ కార్డులు పట్టుకుని మద్యం బాబులు కిలో మీటర్ల కొద్దీ బారులు తీరారు. ఎండని కూడా లెక్కచేయకుండా క్యూ లైన్లో నిలబడుతున్నారు. అయితే అందరికీ మద్యం రావాలన్న ఉద్దేశ్యంతో మనిషికి రెండు క్వార్టర్లు మాత్రమే అమ్ముతున్నారు. అది కూడా  స్థానికులకు మాత్రమే మధ్యం అమ్మకాలు చేస్తున్నారు. ఎక్సైజ్ సీఐ ప్రమీలరాణి  మద్యం షాపుల దగ్గర ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.