అర్థరాత్రి ఒంటరిగానే... వేధించిన ఆకతాయికి ఈ తెలుగమ్మాయి ఎలా బుద్దిచెప్పిందో చూడండి...
గన్నవరం: అమ్మాయిలంటే అబల కాదు సబల అని నిరూపించిందో అమ్మాయి.
గన్నవరం: అమ్మాయిలంటే అబల కాదు సబల అని నిరూపించిందో అమ్మాయి. అర్థరాత్రి ఆకతాయి వెంటపడుతుంటే ఏమాత్రం భయపడకుండా దైర్యంగా అతడిని ఎదుర్కొంది. పరువు పోతుందనో, తనను తాను కాపాడుకుంటే చాలనుకోకుండా మరోసారి ఇలా అమ్మాయిలను వేధించకుండా బుద్దిచెప్పింది.
గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న యువతి గురువారం అర్దరాత్రి విధులు ముగించుకుని స్కూటీపై వెళుతుండగా ఓ ఆకతాయి అడ్డుకున్నాడు. ఒంటిరిగా వున్న యువతిని వేధించడానికి అతడు ప్రయత్నించాడు. అయితే ఏమాత్రం భయపడిపోకుండా ఒంటరిగానే అతడిని ఎదిరించి కర్రతో చితక్కొట్టి బుద్దిచెప్పింది. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో యువతి ధైర్యానికి రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హ్యాట్సాఫ్ చెప్పారు.