సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్... స్థలాన్ని పరిశీలించిన మంత్రి మేకపాటి

నెల్లూరు: ఆత్మకూరులో కోవిడ్ కేర్ సెంటర్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులను ప్రత్యక్షంగా పరిశీలించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. 

First Published Jun 1, 2021, 5:32 PM IST | Last Updated Jun 1, 2021, 5:32 PM IST

నెల్లూరు: ఆత్మకూరులో కోవిడ్ కేర్ సెంటర్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులను ప్రత్యక్షంగా పరిశీలించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. అక్కడ కోవిడ్- 19 సోకిన రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. సినీనటుడు సోను సూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఆక్సిజన్ ప్లాంట్ స్థలాన్ని కూడా మంత్రి పరిశీలించారు. కోవిడ్  కి సంబంధించి మరిన్ని సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ లు మంత్రికి అందించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ (అభివృద్ధి), ఆర్డీఓ చెైత్ర వర్షిణి,  డీఎస్పీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు, ఆర్ఎంవో, నియోజకవర్గ, మండల స్థాయి వైసీపీ నాయకులు పాల్గొన్నారు.