Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా, గోదావరి నదుల్లో ఆయన చితాభస్మాన్ని కలిపిన కుమారుడు

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చితాభస్మాన్ని ఆయన కుమారుడు కృష్ణార్జున రెడ్డి విజయవాడలోని దుర్గా ఘాట్ లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కృష్ణా నదిలో కలిపారు , 

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చితాభస్మాన్ని ఆయన కుమారుడు కృష్ణార్జున రెడ్డి విజయవాడలోని దుర్గా ఘాట్ లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కృష్ణా నదిలో కలిపారు , విజయవాడలో నిమజ్జనం చేసిన తరువాత అటు నుండి రాజమండ్రి వెళ్లి అక్కడ గోదావరిలో కూడా నిమజ్జనం చేసారు. రాత్రికి విజయవాడ చేరుకొని అక్కడే బస చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , ఎమ్మెల్యేలు జోగి రమేష్ ,మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ,దేవినేని అవినాష్ పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు ..