దత్తతకు పిల్లాడ్ని ఇస్తానని మోసం.. పురుగుల మందు తాగిన వివాహిత...
కర్నూలు జిల్లాలో పిల్లలు లేరని బాధపడుతున్న వివాహిత కు మగపిల్లాడిని అమ్ముతామని సొంత మేనత్త మోసం చేసిన ఘటన బయటపడింది.
కర్నూలు జిల్లాలో పిల్లలు లేరని బాధపడుతున్న వివాహిత కు మగపిల్లాడిని అమ్ముతామని సొంత మేనత్త మోసం చేసిన ఘటన బయటపడింది. దత్తత కోసం 10 లక్షల రూపాయలు తీసుకుని మూడు రోజుల పాటు పిల్లాడిని ఇచ్చింది. ఇంకొంత సొమ్ము ఇవ్వకపోతే పిల్లాడ్ని తీసుకెల్తా అంటూ బెదిరింపులకు దిగింది. అలాగే మూడు రోజుల తరువాత పిల్లాడిని వెనక్కి తీసుకెళ్ళింది. దీంతో మనస్తాపం చెందిన వివాహిత నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ శ్రీ సంకల్ప స్కూల్ సమీపంలో ఫురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలిని నంద్యాల ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.