నడిరోడ్డుపై వివాహిత దారుణ హత్య... వివాహేతర సంబంధమేనా?
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం రోడ్డులో దారుణం చోటుచేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం రోడ్డులో దారుణం చోటుచేసుకుంది. గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన దువ్వాడపు చంద్రిక(32) అనే వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. కత్తితో మెడ మీద దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చారు. తీవ్ర రక్త స్రావంలో మృతురాలి మృతదేహం పడివుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు చంద్రిక కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధం ఏమయినా కారణమా అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. దీంతో చంద్రిక ప్రియుడిని పోలీసులు విచారిస్తున్నారు.