తాడేపల్లిలో ఉద్రిక్తత... మహిళా పారిశుద్ద్య కార్మికులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. 

First Published Jul 29, 2021, 2:22 PM IST | Last Updated Jul 29, 2021, 2:22 PM IST

తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి మంగళగిరి కార్పొరేషన్ వరకు పాదయాత్ర చేపట్టిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మిక నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు కార్మికులను ఊడ్చుకు వెళ్లి మరీ అరెస్టు చేశారు. సుమారు 100 మంది మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేశారు.