Asianet News TeluguAsianet News Telugu

నకిలీ చలాన్ల కుంభకోణంలో మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయం

గుంటూరు: నకిలీ చలానాల వ్యవహారంపై జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేశామని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే అక్రమాలు జరిగినట్లు బయటపడిందన్నారు. రూ. 7 లక్షల 95 వేల విలువైన నకిలీ చలానాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేశారన్నారు.సాఫ్ట్ వేర్‌లో ఉన్న లొసుగుల ఆధారంగా కొందరు డాక్యుమెంట్ రైటర్లు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. పాత సాఫ్ట్ వేర్ స్థానంలో కొత్తది సోమవారం నుంచి వినియోగంలోకి రానుందని వెల్లడించారు. దీంతో ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం లేదన్నారు. నకిలీ చలానాల వ్యవహారంలో ఏడు కేసులు నమోదు చేశామని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు తెలిపారు

First Published Aug 13, 2021, 6:04 PM IST | Last Updated Aug 13, 2021, 6:04 PM IST