Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రచరిత్రలోనే రైతులను ఇంతలా బాధపెట్టిన ప్రభుత్వం లేదు : మండలి బుద్ధప్రసాద్

ప్రభుత్వ వైఫల్యం కారణంగా కృష్ణాజిల్లాలో మిగిలి పోయిన ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నిరసన కార్యక్రమం చేపట్టారు. 
 

First Published Apr 20, 2023, 5:30 PM IST | Last Updated Apr 20, 2023, 5:30 PM IST

ప్రభుత్వ వైఫల్యం కారణంగా కృష్ణాజిల్లాలో మిగిలి పోయిన ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నిరసన కార్యక్రమం చేపట్టారు. మోపిదేవి టీడీపీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలసి ర్యాలీ చేపట్టి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను ఇప్పటికీ కొనుగోలు చేసింది 6 లక్షల టన్నులేనని... మిగిలిన ధాన్యాన్ని ఎప్పుడు కొంటారని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో రైతులను ఇంతలా  బాధపెట్టిన ప్రభుత్వం ఏదీ లేదని... వెంటనే ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు పాత బకాయిలను కూడా చెల్లించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని మండలి హెచ్చరించారు.