గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద యువకుడి మృతదేహం... హత్యా..ఆత్మహత్యా?
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టు ఆవరణలో కనకమేడల చైతన్య(29) అనే యువకుడి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభించింది.
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టు ఆవరణలో కనకమేడల చైతన్య(29) అనే యువకుడి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభించింది. గత రాత్రి ఇంట్లో నుండి బయటకి వెళ్లిన అతడు తెల్లవారేసరికి మృతదేహంగా కనిపించాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనుమాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు చైతన్య కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను నిడమానూరు మోడల్ డైరీ లో ఉద్యోగి. తన చావుకి ఎవరూ కారణం కాదు అని రాసి ఉన్న సుసైడ్ నోట్ మృతుని జేబులో లభించింది. అతడి మృతికి కుటుంబ కలహలా లేక ఇంకేమయినా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు గన్నవరం సీఐ శివాజీ తెలిపారు.