Video : పెళ్లి చేసుకొమ్మంటే..విషం తాగించాడు..
విశాఖ మన్యం, పాడేరులో పెళ్లి చేసుకోమన్నందుకు ఓ యువతికి విషం తాగించి ఆమె చావుకు కారణమయ్యాడో రాక్షసుడు.
విశాఖ మన్యం, పాడేరులో పెళ్లి చేసుకోమన్నందుకు ఓ యువతికి విషం తాగించి ఆమె చావుకు కారణమయ్యాడో రాక్షసుడు. పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసే దుగ్గేరి ప్రసాద్, కనకరత్నం గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కనకరత్నం పెళ్లి చేసుకోమని అడిగింది. అది ఇష్టంలేని ప్రసాద్ ఆమెకు విషం తాగించి, ఏమీ తెలియనట్టు ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు ప్రసాద్ ను బహిరంగంగా ఉరితీయాలని ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు.