రోడ్డుపక్కన పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ... హత్యా? ఆత్మహత్యా?
విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో పార్కు చేసి ఉన్న కారులో మృతదేహం వుండటం కలకలం రేపింది. మానర్ ప్లాజా ఎదురుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.మృతుడు తడిగడపకు చెందిన కరణం రాహుల్ గా పోలీసులు గుర్తించారు. ఇతడు జి.కొండూరులో గ్యాస్ సిలిండర్స్ తయారీ కంపెనీ యజమానిగా పోలీసులు తెలిపారు. ఇతడిది ఆత్మహత్యా..? హత్యా..? అన్న కోణంలో పోలీసులు విచారణ సాగింది
విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో పార్కు చేసి ఉన్న కారులో మృతదేహం వుండటం కలకలం రేపింది. మానర్ ప్లాజా ఎదురుగా రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న కారులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మృతుడు తడిగడపకు చెందిన కరణం రాహుల్ గా పోలీసులు గుర్తించారు. ఇతడు జి.కొండూరులో గ్యాస్ సిలిండర్స్ తయారీ కంపెనీ యజమానిగా పోలీసులు తెలిపారు. ఇతడిది ఆత్మహత్యా..? హత్యా..? అన్న కోణంలో పోలీసులు విచారణ సాగింది